ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ స్ట్రిక్ట్‌గా అమ‌లు అవుతోన్నందున బ‌య‌ట‌కు వ‌చ్చిన వారు స‌రైన కార‌ణాలు చూక‌పోతే వారిపై పోలీసులు నిర్దాక్షిణ్యంగా కేసులు పెడుతోన్న సంగ‌తి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో ఈ కేసుల తీవ్రత మ‌రి ఎక్కువుగా ఉంది. అయితే విచిత్రం ఏంటంటే ఉత్త‌రాఖండ్‌లో లాక్‌డౌన్ పాటించని పోలీసులు ఏకంగా ఆరు నెల‌ల శిశువుపై కేసు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే, గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

ఈ విష‌యం పెద్ద రచ్చ కావ‌డంతో ఉన్న‌తాధికారుల దృష్టికి వెళ్లింది. ఉన్న‌తాధికారులు ఈ కేసు బుక్ చేసిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేసి దర్యాప్తునకు ఆదేశించారు. ఏప్రిల్ 10 న ఇద్దరు పిల్లలతో కూడిన ఒక కుటుంబం 47 మందితో పాటు హర్యానా నుండి తమ గ్రామానికి తిరిగి వచ్చి, ముందు జాగ్రత్త చర్యగా ఇంటి నిర్బంధంలో ఉండమని కోరినప్పుడు ఈ సంఘటన జరిగిందని స‌మాచారం. ఈ క్ర‌మంలోనే స్థానిక పోలీసులు ఆరు నెలల ప‌సిపాప‌పై కూడా లాక్‌డౌన్ కేసు పెట్ట‌డంతో స్థానికంగా పెద్ద సంచ‌ల‌నంగా మారింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: