దేశంలో కరోనా మొదలైనప్పటి నుంచి సినీ పరిశ్రమ పూర్తిగా క్లోజ్ అయిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో సెలబ్రెటీలు ఇంటి పట్టున ఉంటూ సోషల్ మాద్యమాల ద్వారా తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. కొంత మంది రక రకాల చాలెంజ్ లు విసురుతున్నారు.  డ్యాన్స్, పాటలు, వంటలు ఒక్కటేమిటి ఫుల్ ఎంట్రటైన్ మెంట్ తో ఉన్నారు.  మరికొంత మంది కరోనా వైరస్ గురించి అవగాహణ ఇస్తున్నారు.  ఇక సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ తనదైన స్టైల్లో ట్విట్టర్ ద్వారా కరోనాపై స్పందిస్తున్నారు. 

 

కరోనా వైరస్‌పై ఈ మధ్య  తనదైన శైలిలో స్పందిస్తున్న ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘1988లో ఆర్జీవీ నాకు పుస్తకాల పురుగుగా  తెలుసు. ఇప్పుడు ఆయన కరోనా పురుగును విశ్లేషించే పనిలో ఉన్నారు. సార్, మీరు ఇంకా స్టీఫెన్ కింగ్ పుస్తకాలు చదువుతున్నారా?’ అని ట్వీట్ చేశారు.  తనకు నచ్చిన ప్రముఖ పుస్తకాల పేర్లు చెప్పాలని డైరెక్టర్ క్రిష్ ట్విట్టర్లో తనను నామినేట్ చేశారని కీరవాణి చెప్పారు.

 

‘పోలీసు చమత్కారం’, ‘కన్యాశుల్కం’,  ‘స్టీఫెన్ కింగ్ నైట్ షిఫ్ట్’,  ‘వంశీ మా పసలపూడి కథలు’  తనకు బాగా నచ్చిన, పదే పదే చదివే పుస్తకాలని తెలిపారు. అయితే మీకు నచ్చిన పుస్తకాలు ఏంటో చెప్పండి గురువు గారూ అంటూ ట్విట్ చేశారు. అంతే కాదు తమకు నచ్చిన పుస్తకాలు ఏమిటో చెప్పాలని ఆర్జీవీ, ఎస్ఎస్ కాంచి, గుణశేఖర్ లను ఆయన నామినేట్ చేశారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: