టెలివిజన్ రంగంలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు ఎడిట‌ర్‌, జ‌ర్న‌లిస్టు అర్నాబ్ గోస్వామి.  తాజాగా రిప‌బ్లిక్ టీవీ ఎడిట‌ర్‌, జ‌ర్న‌లిస్టు అర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టు ఊర‌ట‌నిచ్చింది.  ఆయ‌న‌పై మూడు వారాల పాటు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవ‌ద్దు అని కోర్టు పేర్కొన్న‌ది.  ఆయన కార్యక్రమంలో విద్వేశపూరితంగా మాట్లాడుతారని.. ఆయ‌న‌పై ప‌లు పోలీసు స్టేష‌న్ల‌లో ఎఫ్ఐఆర్‌లు న‌మోదు అయ్యాయి. నాగ‌పూర్‌లో నమోదు అయిన కేసును ముంబైకి బ‌దిలీ చేసేందుకు కూడా కోర్టు అంగీక‌రించింది.  అక్క‌డే ఈ కేసులో విచార‌ణ కూడా జ‌ర‌గ‌నున్న‌ది. జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌తో కూడిన‌ ధ‌ర్మాస‌నం ఇవాళ వీడియోకాన్ఫ‌రెన్స్ ద్వారా కేసును ప‌రిశీలించింది. ఈ మూడు వారాల వ్య‌వ‌ధిలో గోస్వామి .. యాంటిసిపేట‌రీ బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు అని చెప్పింది.  

 

మరోవైపు  చ‌త్తీస్‌ఘ‌డ్‌, రాజ‌స్థాన్, పంజాబ్‌, తెలంగాణ‌, జ‌మ్మూక‌శ్మీర్ రాష్ట్రాల్లో దాఖ‌లైన ఎఫ్ఐఆర్‌ల‌పై కూడా విచార‌ణ నిలిపివేయాల‌ని సుప్రీం బెంచ్ ఆదేశించింది.  ఈ నేపథ్యంలో గురువారం రాత్రి అర్నాబ్‌.. సుప్రీంను ఆశ్ర‌యించారు.  ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ కొనసాగుతుందని.. సుప్రీం కేవ‌లం అత్య‌వ‌స‌ర కేసుల‌ను మాత్ర‌మే విచారిస్తున్న‌ది. ఇవాళ కోర్టులో అర్నాబ్ త‌ర‌పున సీనియ‌ర్ అడ్వ‌కేటు ముఖుల్ రోహ‌త్గీ వాదించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో గోస్వామిపై కేసులు న‌మోదు అయిన‌ట్లు ఆయ‌న కోర్టుకు వెల్ల‌డించారు.

 

ఈ సందర్భంగా ఓ కాంగ్రెస్ నేత చేసిన రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌ల‌ను మాత్ర‌మే తాను ప్ర‌శ్నించిన‌ట్లు గోస్వామి కోర్టుకు తెలిపారు.  తాను పార్టీ చీఫ్ ను మాత్రమే ప్రశ్నించానని.. ఎలాంటి విద్వేశపూరిత వ్యాఖ్యలు చేయలేదని రోహ‌త్గీ కోర్టుకు చెప్పారు.  త‌న‌పై న‌మోదు అయిన ఎఫ్ఐఆర్‌లు.. ప‌త్రికా స్వేచ్ఛ‌కు విఘాతాలు అని గోస్వామి ఆరోపించారు. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున క‌పిల్ సిబ‌ల్ వాదించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: