ప్ర‌స్తుతం ప్రపంచమంతా  కోవిడ్-19  మహమ్మారితో అతలాకుతలమవుతున్న వేళ క‌రోనా బాధితుల‌ను గుర్తించేందుకే ఎన్నో ఆప‌సోపాలు ప‌డాల్సిన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. క‌రోనా ప‌రీక్ష‌లు చేస్తే ఫ‌లితాల కోసం గంట‌లు.. రోజుల కొద్ది వెయిట్ చేస్తున్నారు. అయితే క‌రోనా ప‌రీక్ష చేస్తే రిజ‌ల్ట్ కోసం ఇప్పుడు కేవ‌లం 5 సెకన్లు వెయిట్ చేస్తే చాలు. క‌రోనా వ్యాధిని కేవ‌లం ఐదు సెక‌న్ల‌లో నిర్దారించే సాఫ్ట్‌వేర్‌ను తాను డ‌వ‌ల‌ప్ చేసిన‌ట్టు ఐఐటి-రూర్కీ సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి  చెందిన ప్రొఫెసర్ కమల్ జైన్ కీలక విషయాన్ని వెల్లడించారు. 

 

క‌రోనా వైర‌స్ సోకింద‌న్న అనుమానం ఉన్న వ్య‌క్తి ఎక్స్ రే ఉప‌యోగించి ఐదు సెక‌న్ల‌లో వైర‌స్ ఉనికిని క‌నిపెట్ట‌వ‌చ్చ‌ని ఆయ‌న తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్‌తో వ్య‌క్తి ఎక్స్ రే ద్వారా ఆ ఉద్యోగికి న్యుమోనియా ల‌క్ష‌ణాలు ఉన్నాయో ?  లేదా ? అన్న‌ది వ‌ర్గీక‌రించ‌డంతో పాటు అది క‌రోనాకు సంబంధించిందా ?  లేదా ఇత‌ర బ్యాక్టీరియాల వ‌ల్ల వ‌చ్చిందా ? అన్న‌ది నిర్దార‌ణ చేసుకోవ‌చ్చ‌ని క‌మ‌ల్ చెప్పారు. ఈ నిర్దార‌ణ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తికి బ్రేకులు వేయ‌వ‌చ్చ‌న్న విశ్వాసాన్ని కూడా ఆయ‌న వ్య‌క్తం చేశారు.

 

ఈ సాఫ్ట్‌వేర్ పేటెంట్ కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్)కు దరఖాస్తు చేసినట్టు తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను క‌మ‌ల్ కేవ‌లం 40 రోజుల్లోనే అభివృద్ధి చేశారు.  కరోనా, న్యుమోనియా, క్షయ రోగులతో సహా 60 వేల మంది రోగుల ఎక్స్-రే స్కాన్‌లను విశ్లేషించిన తరువాత మొదట ఒక కృత్రిమ మేధస్సు-ఆధారిత డేటాబేస్ అభివృద్ధి చేసినట్టు వెల్లడించారు. అయితే దీనికి ఇప్ప‌టి వ‌ర‌కు వైద్య‌రంగ ప‌రంగా ఎలాంటి అనుమ‌తులు అయితే లేవు. ఇది కార్య‌రూపం దాలిస్తే అంత‌కు మించిన సంచ‌ల‌నం ఉండ‌దు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: