దేశంలో ఎప్పుడైతే కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడం మొదలు పెట్టిందో జనాలకు కంటిమీద కునుకు లేకండా పోయింది.  ఒకటి కాదు రెండు కాదు లక్ష దాటిన మరణాలు.. లక్షల్లో కేసలతో సతమతమవుతున్నారు.  తాజాగా కరోనా వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలను పాటించాలని అధికారులు ఎంత చెబుతున్నా కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు వాటిని ఉల్లంఘిస్తున్నారు. ఇలాంటి ఘటనే రాజమండ్రిలో చోటుచేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని ఆజాద్‌ చౌక్‌లో్ పోలీసులకు, స్థానికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

 

చిన్న పిల్లలు తాగడానికి మూడు రోజుల నుంచి పాలు కూడా లేవంటూ మహిళలు, స్థానికులు రోడ్డుపై ధర్నాకు దిగారు. పోలీసులు ఆజాద్‌చౌక్‌ను రెడ్‌ జోన్‌గా ప్రకటించి అన్ని దారులు మూసేశారు.  అయితే, పాలతో పాటు నిత్యావసర సరుకులను తమకు పంపిణీ చేయడం లేదంటూ పోలీసులతో స్థానికులు గొడవకు దిగారు. జైల్లో పెట్టినట్టు తమను బాధిస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో స్థానికులకు-పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

 

స్థానికులు ఘర్షణకు దిగడంతో పోలీసు బృందాలు భారీగా మోహరించాయి. విషయం తెలుసుకున్న రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆజాద్‌చౌక్‌ ప్రాంత ప్రజలకు పాలు, నిత్యావసర వస్తువులు హుటాహుటిన అందజేశారు. దాంతో ప్రజలు కాస్త శాంతిపడ్డారు. ఇలా లాక్ డౌన్ పేరు చెప్పి ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని.. తమకు నిత్యావసర వస్తువులు అందించాలని వారు కోరతున్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: