ఏపీ ప్రభుత్వం వారం రోజుల క్రితం రాష్ట్రంలో ఈసీ పదవీ కాలం తగ్గిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో నిమ్మగడ్డ రమేష్ స్థానంలో కనగరాజ్ బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో సోమవారం రోజు నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంపై కీలక వాదనలు జరిగాయి. 
 
ప్రభుత్వం గత శనివారం పిటిషన్ దాఖలు చేయగా ఆదివారం నిమ్మగడ్డ రమేష్ మరో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం హైకోర్టు రెండు పిటిషన్లపై విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో అడ్వకేట్ జనరల్ ప్రిలిమినరీ కౌంటర్ మాత్రమే దాఖలు చేశామని పూర్తి స్థాయి కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలని చెప్పారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన హైకోర్టు 4 రోజుల సమయం ఇచ్చింది. 
 
ఈరోజు ఏపీ ప్రభుత్వం పూర్తి స్థాయి కౌంటర్ పిటిషన్ ను దాఖలు చేసింది. 7 పేజీల కౌంటర్ అఫిడవిట్ ని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసింది. హైకోర్టు కౌంటర్ పిటిషన్ విచారణ అనంతరం ఎలాంటి తీర్పు చెబుతుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: