హైదరాబాద్ నగరంలో కరోనా కంటైన్మెంట్ జోన్లు వేగంగా పెరుగుతున్నాయి. దానికి కారణం కరోనా పాజిటివ్ కేసులు నగరమంతా నమోదవుతుండడమే. రెడ్ జోన్లు (కంటైన్మెంట్ ఏరియాలు) పెరిగిపోతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 190 కంటైన్మెంట్ జోన్లను గుర్తించామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ జోన్లలో మరింత పకడ్బందీగా లాక్ డౌన్ అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. కంటైన్మెంట్ జోన్‌లలో పూర్తిగా సీలింగ్ చేస్తున్నామని.. ఒకరకంగా సీలింగ్ లాక్ డౌన్ అమలు చేస్తున్నామని ప్రకటించారు అధికారులు.

 

కంటైన్మెంట్ జోన్ల నుంచి ఎవరు బయటికి రాకుండా.. బయటి నుండి ఎవరు లోపలికి వెళ్లకుండా ఏర్పాటు చేశామని చెబుతున్నారు. ప్రస్తుతం 190 పైగా కంటైన్మెంట్ జోన్లు హైదరాబాద్‌లో ఉన్నాయని, కనీసం 14 రోజులు కంటైన్మెంట్ జోన్ల నుంచి ప్రజలు ఎవరు బయటికి రాకుండా ఉంటే కరోనా వ్యాప్తిని అరకట్టవచ్చంటున్నారు. తాజాగా హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ పరిధిలోని 3 కంటైన్ మెంట్ జోన్లు ఎత్తివేశారు.

 

అపురూప కాలనీ, మోడీ బిల్డర్స్, సుభాష్ నగర్ లో కంటైన్ మెంట్ ను ఎత్తివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. గత 14 రోజులుగా ఇక్కడ ఒక్క పాజిటీవ్ కేసు కూడా నమోదు కాకపోవడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాల మేరకు కంటైన్ మెంట్ ఎత్తివేశారు. కంటైన్ మెంట్ ఎత్తివేసినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: