ప్ర‌పంచ వ్యాప్తంగా విజృంభిస్తోన్న క‌రోనా వైర‌స్ క్ష‌ణం క్ష‌ణానికి చాప‌కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. శుక్ర‌వారం ఉద‌యం వ‌ర‌కు ఉన్న లెక్క‌ల‌ను బ‌ట్టి చూస్తే క‌రోనా పాజిటివ్ కేసులు 28.30 ల‌క్ష‌ల‌కు చేరుకున్నాయి. ఇక క‌రోనా మ‌ర‌ణాలు 2 ల‌క్ష‌ల‌కు చేరువ‌లో ఉన్నాయి. ఇక గ‌త 24 గంట‌ల లెక్క‌ల‌ను బ‌ట్టి చూస్తే అగ్ర రాజ్యం అమెరికాలో 1200 మంది మాత్ర‌మే చ‌నిపోవ‌డం ఓ ర‌కంగా ఊర‌టే అని చెప్పాలి.

 

ఇక శుక్ర‌వారం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోన్న కరోనా కేసులు, మరణాల లెక్క‌లు ఇలా ఉన్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా 210 దేశాలకు విస్తరించిన కరోనా వ‌ల్ల 28,26,659 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.  1,96,971 మంది మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒకే రోజు 1,03,490 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 6,054 మంది మృతి చెందారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: