ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్.. ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునేవారిలో ఒకరు. తాజాగా.. మ‌న సుంద‌ర్ మ‌రో రికార్డు క్రియేట్ చేశారు.  2019ఏడాదికిగాను అత్య‌ధిక ప‌ర‌కిహారం పొంద‌డంలోనూ ముందంజ‌లో ఉన్నారు. 281 మిలియన్ డాల‌ర్ల‌ను ఆయ‌న గ‌త ఏడాదికిగాను ప‌రిహారంగా పొందారు. ఈ పరిహారం ఆల్ఫాబెట్ ఉద్యోగుల సగటు వేతనానికి 1,085 రెట్లు అని కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి సుంద‌ర్‌పిచాయ్ పేరు మ‌రోసారి మార్మోగుతోంది. అయితే.. ప‌రిహారం విష‌యంలో హెచ్చుత‌గ్గులు కూడా ఉండొచ్చు. ఒక్కోసారి ఎక్కువ‌గా.. త‌క్కువ‌గా ఉండే అవ‌కాశాలు ఉంటాయి. కంపెనీ స్టాక్ అవార్డ్స్‌, ఇత‌ర కంపెనీల‌తో పోల్చిన‌ప్పుడు ఆల్ఫాబెట్ స్టాక్ రిట‌ర్న్స్ ఆధారంగా ప‌రిహారం చెల్లించే అవ‌కాశం ఉంటుంది.

 

ఇక 2019లో సుంద‌ర్ పిచాయ్ వార్షిక వేతనం 6,50,000 డాల‌ర్లుగా ఉందని శుక్ర‌వారం రెగ్యులేట‌ర్ల‌కు దాఖ‌లుచేసిన ప్రాక్సీ ప్ర‌క‌ట‌న‌లో కంపెనీ వెల్ల‌డించింది. అయితే.. ఈ ఏడాది వార్షిక వేత‌నం మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. 2మిలియ‌న్ డాల‌ర్లకు పెరిగే అవ‌కాశం ఉంద‌ని కంపెనీ పేర్కొంది. భార‌తీయుడికి ద‌క్కిన అపురూప గౌర‌వమ‌ని, ఇది మ‌నంద‌రికీ ఎంతో గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని ప‌లువురు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: