దేశంలోకరోనా ఎప్పుడైతే వ్యాప్తి చెందడం మొదలు పెట్టింది ఎవ్వరికీ కంటిమీద కునుకు లేకుండా ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు కరోనా ఎఫెక్టీవ్ పడుతూ ఉంది.  ఇక కరోనా కట్టడి చేయడానికి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు తమ విధులు ఎంతో చక్కగా నిర్వహిస్తూ ఎవరినీ బయటకు రాకుండా కాపలా కాస్తున్నారు.  కృష్ణాజిల్లా, విజయవాడలో కరోనా పంజా విసురుతోంది. శుక్రవారం ఏకంగా 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కర్నూల్, శ్రీకాలహస్తిలో ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.

 

తాజాగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ ఎస్సైకి పాజిటివ్‌ తేలింది. వెంటనే ఆయనకు సన్నిహితంగా ఉన్నవారిని క్వారంటైన్‌కు తరలించారు. విజయవాడలో పనిచేసే ఇద్దరు ఎస్సై‌లు ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఓ ఎస్సై దగ్గుతో బాధపడుతుండటంతో నాలుగు రోజుల క్రితం పరీక్షలు నిర్వహించారు. ఎస్సై శాంపిల్స్ ఫలితాల్లో పాజిటివ్ లేతలింది.

 

ఎస్సైతో పాటూ ఇంట్లో ఉంటున్న వారిని.. అలాగే ఎస్సై విధులు నిర్వహించే పోలీస్ సిబ్బంది 60మందిని క్వారంటైన్‌కు పంపి పరీక్షలు నిర్వహించారు.  కరోనా కట్టడి చేసే నేపథ్యంలో డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ద్య కార్మికులు ఎంతో కృషి చేస్తున్నారు. ఎన్ని జాగ్రత్త చర్యలుతీసుకుంటున్నా వారిలోకూడా కరోనా పాజిటీవ్ లు కనిపించడం కలవరానికి గురి చేస్తుంది.  

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: