దేశంలో కరోనా వైరస్ వల్ల మనుషులే కాదు జంతువులకు నానా కష్టాలు వచ్చి పడ్డాయి.  ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు బయటకు రాకపోవడంతో గుడి, పార్కులు ఇతర పర్యాటక కేంద్రాల వద్ద జంతువులకు తిండి దొరకకపోవడంతో అలమటించి చనిపోతున్నాయి. కర్నూల్ లో వరుసగా కోతులు చనిపోయిన విషయం తెలిసిందే.  తమిళనాడు లో కాకులు చనిపోయాయి.. వాటికి కరోనా వైరస్ అని భావించారు.. కానీ అది తప్పని కేవలం అవి ఆకలి తట్టుకోలేక చనిపోయాయిన అధికారులు తేల్చి చెప్పారు.  తాజాగా  మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మూల్ తాలూకాలోని ససిదాబాగావ్‌లో ఓ ఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది.

 

తల్లి నుంచి తప్పిపోయిన పులి పిల్ల బయటకు రావడంతో గమనించిన కుక్కలు  దానిని తరుముకుంటూ వచ్చాయి. ప్రాణభయంతో పరుగులు పెట్టిన పులిపిల్ల గ్రామంలోని ఓ పశువుల పాకలో దూరింది. గమనించిన గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే గ్రామానికి చేరుకుని పులి కూనను స్వాధీనం చేసుకున్నారు. అయితే దాని వయసు ఒక్క సంవత్సరం లోపే  ఉంటుందని అధికారులు తెలిపారు. 

 

లాక్ డౌన్ నేపథ్యంలో కొన్ని కృర జంతువులు జనారణ్యాల్లోకి రావడం కలవరం సృష్టిస్తున్నాయి.  ఏది ఏమైనా లాక్ డౌన్ కారణంగా వణ్యప్రాణులకు సంకటం వచ్చి పడింది.  మనుషులే కాదు జంతువులకు కాస్త ఆదరణ చూపండి అంటూ జంతు ప్రేమికులు కోరుకుంటున్నారు. తమకు తోచిన తిండి పదార్థాలు మన మద్య తిరుగుతుతున్న జంతువులకు అందజేయాలని అంటున్నారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: