మన దేశంలో కరోనా ప్రభావం గత నెల నుంచి మొదలైంది.  దీనికి ముఖ్య కారణం అప్పట్లో విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల ఇతరులకు కరోనా వ్యాప్తి చెందిందని అన్నారు.  ఆ తర్వాత మర్కజ్ ప్రార్థనల ఎఫెక్ట్ వల్ల కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయని అన్నారు. తెలంగాణలో కరోనా ప్రభాం ఎక్కువగా కరీంనగర్ లో ఉందని మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు.  తాజాగా జిల్లాలో కరోనా పరిస్థితిపై మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. మే నెల 7వ తేదీ తర్వాత కరీంనగర్‌ ఫ్రీ జోన్‌ అవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమమంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. 

 

కరోనా నియంత్రణకు మందు, టీకా లేదన్న మంత్రి ఇంటికి మాత్రమే పరిమితమైతే కరోనా వైరస్‌ను నియంత్రించవచ్చన్నారు. ఇప్పటి వరకు ప్రజలు ఇచ్చిన సహకారం ఎంతో గొప్పగా ఉందని.. కరోనా సమయంలో పూర్తిగా లాక్ డౌన్ ఉందని.. ఇంటిపట్టున ఉంటూ కరోనాపై యుద్దం చేస్తున్నామని అన్నారు. రంజాన్‌ మాసంలో ముస్లిం పెద్దలు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. ఇంటికే పరిమితమై ప్రార్థనలు చేసుకోవాలని కోరారు. పండ్లు, సరుకులు ఇళ్ల వద్దకే వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రైతులెవరూ పంటలను తగులబెట్టుకోవద్దని సూచించారు. తేమ, తాలు ధాన్యం ఉన్నా భరించాలని అధికారులను కోరుతున్నామన్నారు. 

 

రాష్ట్రంలో ఇప్పటికే 13 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా అందుబాటులో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌ను నమ్ముకున్న ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు సహకరించారు.. మరికొన్ని రోజులు ఓపిక పడితే మనం కరోనా నియంత్రించిన వాళ్లం అవుతామని మంత్రి అన్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: