కొవిడ్ -19 భార‌త్‌లో పంజా విసురుతోంది.  దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య పెరుగుతోంది. వైరస్‌ సోకిన వారిని రాష్ట్ర ప్రభుత్వాలు ద‌వాఖాన‌ల్లో చేర్చి  చికిత్స అందిస్తున్నాయి. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఎటావా జిల్లాలోని ఉత్రరప్రదేశ్‌ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రి ముందు 69 మంది కరోనా వైరస్‌ బాధితులు చేరుకున్నారు. కానీ ఆ ఆసుపత్రికి గేటుకు తాళం వేయటంతో వైరస్‌ బాధితులు గేటు ముందే కూర్చున్నారు. 

 

ఆగ్రా నుంచి 69 మంది  కరోనా వైరస్‌ బాధితులు ఎటావా జిల్లా సైఫాయిలోని ఉన్న యూనివర్సిటీ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ ఆసుపత్రికి బదిలీ చేయబడ్డారు. దీంతో సుమారు 116 కిలో మీటర్లు బస్‌లో ప్రయాణం చేసిన బాధితులు ప్రభుత్వ కళాశాల ఆసుపత్రికి గురువారం ఉదయం చేరుకున్నారు. అప్పటి ఆ ఆసుపత్రి గేట్లకు తాళం వేసి ఉండటంతో ఏం చేయాలో తోచక ఆసుపత్రి బయట ఉన్న ఫుట్‌పాత్‌ మీద సుమారు గంట పాటు వేచి ఉన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్ అయింది. 

 

దీంతో స్పందించిన అటు పోలీసులు, ఉత్తరప్రదేశ్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ స్పందించారు.  సరైన‌ సమాచారం లేకపో వటం వల్ల ఇలా జరిగిందంటూ పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: