క్రికెటర్ డేవిడ్ వార్నర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైదానం  ఏదైనా ప్రత్యర్థి ఎవరైనా తనదైన ఆటతో  అందరినీ ఆకర్షిస్తూ మైదానంలో మెరుపులు మెరిపిస్తూ ఉంటాడు డేవిడ్ వార్నర్. ఇక మైదానంలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు.  కేవలం మైదానంలోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటాడు డేవిడ్  వార్నర్. ముఖ్యంగా టిక్టాక్ లో  ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీతో డాన్సింగ్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. ఇక తాజాగా ఇలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టిక్ టాక్ లో ఒక క్లాసిక్ మ్యూజిక్ పైన డేవిడ్ వార్నర్ తన ఇద్దరు కూతుర్లు భార్యతో కలిసి డాన్స్ చేసాడు. అది కూడా తన జెర్సీ  ధరించి హెల్మెట్ పెట్టుకుని బ్యాట్ పట్టుకుని  డాన్స్ చేయడం ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: