మందుబాబుల‌కు నిజంగా ఇది చేదు వార్తే...  క‌రోనా వైర‌స్‌తో ప్ర‌పంచ‌మంతా పోరాడుతుంటే... సంద‌ట్లో స‌డేమియాలాగా మందుబాబులు మాత్రం లిక్క‌ర్ కోసం తెగ ఆరాట‌ప‌డుతుండ‌టం ఇటీవ‌ల చూస్తూనే ఉన్నాం. లాక్‌డౌన్ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా బార్లు, రెస్టారెంట్లు మూత‌బ‌డ్డాయి. 32 రోజులుగా మ‌ద్యం దుకాణాలు తెరుచుకోక ‌పోవ ‌డంతో మద్యం దొర‌క్క మందుబాబులు పిచెక్కిన‌ట్లు  ప్ర‌వర్తిస్తున్నారు. అయితే ఈనెల 20వ తేదీ నుంచి లాక్‌డౌన్ లో మ‌ద్యం దుకాణాల‌కు స‌డ‌లింపు ఉం టుంద‌ని ప‌లువురు భావించిన‌ప్ప‌టికీ వారి ఆశ‌లు అడియాశ‌లే అయ్యాయి. 

 

ఈక్ర‌మంలేనే అన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, డీజీపీల‌తో కేంద్ర కేబినెట్ సెక్ర‌ట‌రీ ఇవాళ వీడియా కాన్ప‌రెన్స్ నిర్వ‌హించారు. క‌రోనా నివార‌ణ చ‌ర్య‌లు, లాక్‌డౌన్ అమ‌లవుతున్న తీరుపై ఆరా తీశారు. ఈస‌మావేశంలో మ‌ద్యం అమ్మ‌కాలు ప్రారంభిస్తామ‌ని, త‌మ‌కు అనుమ‌తులు ఇవ్వాల‌ని చాలా రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. దీనిపై స్పందించిన కేంద్ర కేబినెట్ సెక్ర‌ట‌రీ.. ఇప్ప‌ట్లో కుద‌ర‌ద‌ని తేల్చి చెప్పారు. దీంతో మందుబాబుల‌కు మ‌రోసారి నిరాశే ఎదురైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: