ప్ర‌స్తుతం లాక్‌డౌన్‌ను బాగా ఎంజాయ్ చేస్తూ అటు సినీ కార్మికుల కోసం త‌న‌వంతుగా చారిటీ ఏర్పాటు చేసి సినిమా వాళ్లంద‌రిని ఒకే వేదిక మీద‌కు తీసుకు వ‌చ్చి వేల‌మంది పేద కార్మికుల‌ను ఆదుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్ర‌మంలోనే చిరంజీవి ఇంట్లోనే ఉంటూ ఓ వెబ్ పోర్ట‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్య‌లో అంతా బాగున్నా అస‌లు వార‌సుడిని ఎప్పుడు ఎత్తుకుంటార‌న్న ప్ర‌శ్న‌కు షాకింగ్ ఆన్స‌ర్ ఇచ్చారు. త‌న‌కు చ‌ర‌ణ్ వార‌సుడిని ఎత్తుకోవాలనే వుంది... కానీ పిల్లలు వాళ్ల ప్లానింగ్ ఏమిటో. రామచరణ్ ను సురేఖ అడుగుతూనే వుంటుంది. ఏదో ప్లానింగ్ అంటారు. ఏమిటో తెలియదు. వాళ్ల ఇష్టం. మనం ఎంత చెప్పాలో అంతేగా చెప్పగలం అని చెప్పారు.

 

చిరంజీవి ఇచ్చిన ఈ ఆన్స‌ర్‌ను బ‌ట్టి చూస్తే చిరు, సురేఖ‌ల‌కు త‌మ మ‌న‌వ‌డిని ఎత్తుకుని ముద్దులు పెట్టుకుంటూ ఆడించుకోవాల‌న్న ఆతృత ఉన్నా .. ఈ విష‌యంలో చెర్రీ, ఉపాస‌న మాత్రం వీళ్ల మాట‌ను పెద్ద‌గా ప‌ట్టించుకున్న అనిపించ‌ట్లేద‌న్న చ‌ర్చ‌లు సోష‌ల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అందుకే చిరు సైతం ఈ ప్ర‌శ్న‌కు బదులిస్తూ సురేఖ ఎప్పుడు అడుగుతున్నా వాళ్ల ఇష్టాలేంటో మ‌న‌కు తెలియ‌ద‌న్న‌ట్టుగా చిరు చెప్పారు. ఇప్ప‌టికే వీరి పెళ్ల‌య్యి యేళ్లు గ‌డుస్తోంది. వీరి తోటి హీరోలు ఎన్టీఆర్‌, బ‌న్నీ లాంటి వాళ్ల‌కు ఇద్ద‌రేసి పిల్ల‌లు పుట్టారు. ఇంకా చ‌ర‌ణ్ దంప‌తులు పిల్ల‌లు ఎప్పుడు కంటారా ? అని కోట్లాది మంది సినీ అభిమానులు వెయిటింగ్‌లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: