ఇటీవ‌ల అమెకారి అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్య‌ర్థ‌న‌మేర‌కు భార‌త్ మ‌లేరియా నివార‌ణ మందు హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్ర‌ల‌ను ఆ దేశానికి పంపిన విష‌యం తెలిసిందే. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌పై అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) తాజాగా కీలక ప్రకటన చేసింది. కరోనా రోగులకు ఈ మందును ఉపయోగిస్తే సైడ్‌ ఎఫెక్ట్స్‌ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. కరోనాను హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ నియంత్రిస్తుందనే దానిపై సరైన ప్రయోగం జరగలేదని, దీనిని అధికంగా వాడటం మూలంగా ప్రమాదం తలెత్తే అవకాశం ఉందని ఎఫ్‌డీఏ అభిప్రాయడింది. అలాగే గుండె సంబంధిత వ్యాధులు కూడా సంక్రమించే ప్ర‌మాదం ఉందని హెచ్చరించింది. ఈ మేరకే ఎఫ్‌డీఏ చీఫ్‌ ఎమ్‌. స్టీఫెన్‌ ఓ ప్రకటక విడుదల చేశారు.

 

అమెరికాలో వైరస్‌ సోకిన వారికి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే  హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. కాగా ప్రమాదకర కరోనా వైరస్‌కు ఇప్ప‌టివ‌ర‌కు వ్యాక్సిన్ లేని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైరస్‌ నుంచి రోగిని కాపాడేందుకు  హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వాడొచ్చ భారత్‌ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) అనుమతినిచ్చింది. ఈ నేప‌థ్యంలోనే ఆ మందును తమకు కూడా సరఫర చేయాలని అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు భారత్‌ను అభ్యర్థించాయి. అప్పుడు ఎఫ్‌డీఏ కూడా గ్రీన్‌ సిగ్నిల్‌ ఇచ్చింది. దీంతో అమెరికాతో పాటు పలు ప్రపంచ దేశాలకు భారత్ ఈ మాత్ర‌ల‌ను ఎగుమతి చేసిన విష‌యం తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: