దేశంలోనే యాభై లక్షల పరిహారం ప్రకటించిన ఘనత ఏపీ సీఎం జగన్ ప్రభుత్వానిదే అని డీజీపీ గౌతమ్‌సవాంగ్ అన్నారు.  లాక్‌డౌన్‌లో విధులు నిర్వర్తిస్తూ కరోనా తో మృతి చెందిన పరిగి ఏఎస్ఐ కుటుంబానికి ఏపీ సీఎం జగన్ మోహన్‌ రెడ్డి  రూ. 50 లక్షల  ఎక్స్ గ్రేషియా ప్ర కటించిన  సంగ‌తి తె లిసిందే.. ఈమేర‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ కృతజ్ఞతలు తెలిపారు.  బాధిత కుటుంబానికి చెక్ అందజేసినట్లు చెప్పారు. దేశంలోనే యాభై లక్షల పరిహారం ప్రకటించిన ఘనత జగన్ ప్రభుత్వానికే ద‌క్కింద‌ని ఆయ‌న  కొనియాడారు. 

 

అంతేగాక దేశంలోనే అత్యధిక మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్న ఘనత కూడా ఏపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.  కరోనాపై సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు తగవని హితవు ప లికారు. వ్యవసాయ కార్యకలాపాలు, పరిశ్రమలకు అనుమతిచ్చినట్లు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: