దేశంలో రోజురోజుకీ కరోనా బీభత్సం సృష్టిస్తుంది.  కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఎన్ని కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కరోనాని మాత్రం కట్టడి చేయలేకపోతున్నాం.  ఇప్పటికే దేశంలో లాక్ డౌన్ సీరియస్ గానే పాటిస్తున్నారు.. పోలీసులు గట్టి నిఘా వ్యవస్థ కొనసాగిస్తున్నారు.  కానీ కొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.  ఈ సమయంలో పేద కుటుంబీకులు కష్టాలు పడుతున్నారు.  అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని వారికి సహాయకార్యక్రమాలు చేస్తున్నారు ‘జనసేన’ కార్యకర్తలు.  తాాజాగా  కరోనా విపత్కర సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల కోసం జనసేన కార్యకర్తలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, వారందరినీ తాను అభనందిస్తున్నానని జనసేన అధినేత పవన్ పేర్కొన్నారు.

 

ఈ మేరకు శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.  అయితే కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో జనసైనికులు ఎంతో జాగ్రత్తగా ఉండాలని.. సామాజిక దూరం తప్పకుండా పాటించాలిని.. శానిటైజర్స్ అందుబాటులో ఉంచుకోవాలని.. మాస్క్ లు తప్పకుండా పెట్టుకోవాలని.. ఈ విషయాలు మొత్తం ప్రజలకు తప్పకుండా చెప్పాలని వారిని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉందని అన్నారు.

 

ప్రజలంతా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యిని దాటేశాయి. రాష్ట్రవ్యాప్తంగా 1016 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు 171 మంది డిశ్చార్జ్ అవగా, కరోనా పాజిటివ్‌తో మరణించిన వారి సంఖ్య 31కి చేరింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: