దేశంలో ఓ వైపు లాక్ డౌన్ ప్రకటించి ఇంటి నుంచి ఎవరూ బయటకు వెళ్లొద్దు అని ఆంక్షలు విధిస్తున్నా కొంత మంది నిర్లక్ష్యం వల్ల కరోనా పెరిగిపోతూనే ఉంది. లాక్‌డౌన్‌ సరదాగా గడిచిపోయేందుకు చాలా మంది రకరకాల ఆటల్లో మునిగి తేలుతున్నారు. ఎప్పుడు టీవీ, ఫోన్లు కాకుండా పాత ఆటలను ఆడుతూ.. గడిపేస్తున్నారు. బోర్ కొట్టకుండా ఉండేందుకు చాలా మంది సంప్రదాయ ఆటలైన అష్టాచమ్మా లాంటి ఆటలు ఆడుతున్నారు. 

 

సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ మహిళ ఇటీవల మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తిని కలిసింది. అప్పటికే ఆమెకు కరోనా సోకడంతో ఇది తెలియక ఆమె చుట్టుపక్కల వాళ్లను కలుస్తూ.. వారితో అష్టాచమ్మా ఆటలు ఆడింది. దీంతో ఈ వైరస్ వారికి వ్యాప్తి చెందింది. దీంతో ఒకేసారి 31 మందిని క్వారంటైన్‌కు తరలించారు.

 

నేడు విజయవాడలో ఒక వ్యక్తి ద్వారా 17 మందికి కరోనా సోకినట్లు అధికారులు తేల్చారు.  కృష్ణలంక లోని గుర్రాల రాఘవయ్యాగారి విధిలో ఉండే ఓ లారీ డ్రైవర్ ఇటీవల పశ్చిమ బెంగాల్ కి వెళ్లొచ్చాడు.  వచ్చిన వెంటనే ఇరుగు పొరుగుతో కలిసి పేకాట ఆడాడు. అనంతరం అతడికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది.  అతడితో ఆడిన 17 మంది కరోనా వచ్చింది.  దాంతో ఈ సమయంలో అందరూ సామాజిక దూరం ఉండాలని.. ఇంటిపట్టున ఉండాలని అధికారులు కోరుతున్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: