ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి భారిన పడి జనాలు విల విలలాడుతున్నారు.  చిన్న దేశాల నుంచి మొదలు అగ్ర రాజ్యమైన అమెరికాను సైతం గడ గడలాడిస్తుంది ఈ చిన్న పరాన్నజీవి.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన కరోనా మహమ్మారి ఇప్పుడు ప్రపంచంలో దేశాలన్నీ చుట్టేస్తుంది.  కరోనా వల్ల లక్ష కు పైగా మరణాలు సంబవించాయి.  ఇక లక్షల్లో కరోనా కేసులు.. నమోదు అవుతున్నాయి.  ఇక మనదేశంలో కూడా కరోనా నానాటికీ విస్తురిస్తూ పోతుంది.  భారత్ లో ఫిబ్రవరి నుంచి కరోనా వ్యాప్తి మొదలైందని చెప్పవచ్చు.  అప్పట్లో విదేశాల నుంచి వచ్చిన వారి వల్ల ఈ కరోనా ప్రబలిపోయిందని చెప్పారు. 

 

ఆ తర్వాత ఢిల్లీలోని ముజాహిద్దీన్ మర్కజ్ ప్రార్ధనలు చేసి సమావేశంలో పాల్గొన్న వారి వల్ల  ఈ కరోనా అంతకంత పెరిగిపోతూ వచ్చిందని చెబుతున్నారు.  చాలా వరకు కేసుల మూలాలు మర్కజ్ తోనే ఉంటున్నాయి.  ఈ నేపథ్యంలో ఇప్పటివరకు 24,942 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇందులో  18,953 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1490 కొత్త కేసులు నమోదు కాగా, ఒక్కరోజులోనే 56 మంది మృత్యువాత పడ్డారు.

 

దేశంలో ఇప్పటివరకు మరణించినవారి సంఖ్య 779కి పెరిగింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 5210 అని కేంద్రం వెల్లడించింది. కొవిడ్-19 వ్యాప్తిని నిలువరించేందుకు గత నెల 24న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 21 రోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం దీన్ని మే 3 వరకు పొడిగించారు.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: