మన వేదాల్లో చెట్ల ఆకులు, కొమ్మలు, వేర్ల ద్వారా ఎంతో అద్భుదమైన ఔషదాలు తయారు చేసి మంచి ఫలితాలు పొందారు.  ఇప్పటికే చాలా చోట్ల చెట్ల ఔషదాలు వాడుతున్నారంటే అతిశయోక్తి లేదు.  తాజాగా కోక్యులస్ హిర్సుటస్ అంటే ఎంటో మెజారిటీ ప్రజలకు తెలియకపోవచ్చు కానీ, చీపురుతీగ, దూసరతీగ అంటే మాత్రం పల్లెటూళ్లలో ఉండే చాలామంది గుర్తుపట్టేస్తారు.  ఈ తీగ ఆకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని.. ఇప్పటికే చీపురుతీగ నుంచి తయారుచేసిన ఔషధం డెంగ్యూపై పరీక్షించారు. దీని సమర్థత కరోనా వైరస్ పై ఏ మేరకు ఉంటుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.

 

ఈ వృక్ష ఆధారిత ఔషధంపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో  మేరకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)కి దరఖాస్తు చేసుకుంది. పరిమితి సంఖ్యలో 50 మంది రోగులపై పరీక్షలు జరిపి ఈ ఔషధం సమర్థతను తెలుసుకోవాలని సీఎస్ఐఆర్ భావిస్తోంది. ప్రస్తుతం ఈ ఔషధం పనితీరును అంచనా వేసేందుకు ప్రయోగాలు నిర్వహించాలని సీఎస్ఐఆర్ భావిస్తోంది.

 

డెంగ్యూపై ప్రాథమిక పరీక్షల్లో ప్రభావవంతంగా పనిచేసిందని సీఎస్ఐఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు.కోక్యులస్ హిర్సుటస్ నుంచి తయారుచేసిన ఔషధంలో యాంటీ వైరల్ ఎలిమెంట్లు పుష్కలంగా ఇది తమ ప్రయోగాలకు పనికి వస్తుందనిభావిస్తున్నారు.   తాము ఈ ఔషధాన్ని కరోనాపై ప్రయోగించేందుకు డీజీసీఐ అనుమతి కోసం చూస్తున్నామని, దీన్ని దేశంలోని గిరిజనులు ఉపయోగిస్తుంటారని వెల్లడించారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: