తెలంగాణలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం కాస్త త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  ఈ రోజు కేవ‌లం కొత్తగా ఏడు క‌రోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు 990 వందలకు చేరుకున్నాయి. కరోనా మహమ్మారికి ఇప్పటి వరకు 25 మంది బలయ్యారు. కొవిడ్‌-19 బారి నుంచి కోలుకుని 307 మంది బాధితులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌‌ అయ్యారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 638 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. ప్ర‌ధానంగా హైద‌రాబాద్‌, సూర్యాపేటతోపాటు మ‌రికొన్ని జిల్లాల్లో మాత్ర‌మే క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా ఉంది. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆయా ప్రాంతాల‌పైనే ఎక్కువ‌గా దృష్టిసారిస్తున్నారు. ఉన్న‌తాధికారుల‌కు జిల్లాల్లో క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న‌కు పంపుతున్నారు.

 

ఇటీవ‌ల సీఎస్ సోమేష్‌కుమార్‌, డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి, రాష్ట్ర ఆరోగ్య ముఖ్య కార్య‌ద‌ర్శి సూర్యాపేట‌లో ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. ఇక కంటోన్మెంట్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను మ‌రింత క‌ట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ప్ర‌జ‌లు ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ‌లో కాస్త త‌గ్గుముఖం ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: