ప్రాణాల‌కు తెగించి క‌రోనా వైర‌స్ పేషెంట్ల‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు, న‌ర్సులు కూడా వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ప్ర‌తీ రోజు ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈక్ర‌మంలో ప‌లువురు డాక్ట‌ర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. డాక్ట‌ర్లు పీపీఈ కిట్ల‌ను వినియోగిస్తున్నా.. వైర‌స్ బారిన ప‌డుతున్నారు. అయితే.. డాక్ట‌ర్లు వంద‌శాతం సేఫ్‌గా ఉండేలా.. గుజరాత్‌లోని వడోదరాలో ఉన్న ష్యూర్ సేఫ్టీ (ఇండియా) లిమిటెడ్ స‌రికొత్త పీపీఈ కిట్ల‌ను త‌యారు చేసింది. వీటికి మ‌రో ప్ర‌త్యేక‌త కూడా ఉంది... పునర్వినియోగ వ్యక్తిగత రక్షణ పరికరాల (పిపిఈ) కిట్లు కూడా.. ఈ సంద‌ర్భంగా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నిషిత్ దండ్ మాట్లాడుతూ... తాము కొవిడ్ -19 భద్రతా సామగ్రిని భారత ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వం, భారత రక్షణ రంగానికి అందిస్తున్నామ‌ని తెలిపారు.

 

ఈ సూట్లను ధరిస్తే, వైద్యులు వంద‌శాతం సురక్షితంగా ఉంటారని తెలిపారు. ఎందుకంటే ఇది సానుకూల గాలి పీడనంతో పనిచేస్తుందని.. సూట్లలోని గాలి నాణ్యతను ఆన్‌లైన్‌లో కూడా కొలుస్తారని ఆయ‌న వెల్ల‌డించారు. అంతేగాకుండా.. ఈ  పిపిఈ సూట్ దానిక‌దే క్లీన్ అవుతుందని... పారేయ‌కుండా వాడుకోవ‌చ్చున‌ని.. బయోమెడికల్ వ్యర్థాలు ఉత్పత్తి కావ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇక నుంచి వైద్యులు మ‌రింత ధైర్యంగా క‌రోనా బాధితుల‌కు చికిత్స అందించ‌వ‌చ్చు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: