స‌చిన్ టెండూల్క‌ర్‌.. ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ బ్యాట్స్‌మెన్‌. త‌న కెరీర్‌లో ట‌న్నుల కొద్దీ ప‌రుగులు సాధించి, అనేక రికార్డులు నెల‌కొల్పిన గొప్ప ఆట‌గాడు. అయితే.. స‌చిన్ కెరీర్ కూడా మొద‌ట్లో కాస్త ఒడిదుడుకుల గురైంది. ఈ స‌మ‌యంలో త‌న సామ‌ర్థ్యంపై స‌చిన్ కూడా సందేహం క‌లిగింద‌ట‌. ఈ విష‌యాన్ని ఆయ‌నే స్వ‌యంగా చెప్పారు. త‌న మొద‌టి మ్యాచ్‌లో త‌న సామ‌ర్థ్యంపై సందేహం క‌లిగిన‌ప్పుడు.. విశ్వాసం కోల్పోయిన‌ప్పుడు ర‌విశాస్త్రి ఇచ్చిన స‌ల‌హా త‌న కెరీర్‌ను ఎంతో మార్చేసింద‌ని స‌చిన్ టెండూల్క‌ర్ తాజాగా వెల్ల‌డించారు.

 

*పాకిస్తాన్ స్టార్ బౌల‌ర్లు వసీం అక్ర‌మ్‌, వ‌కార్ యూనిస్‌ల బౌలింగ్‌ను ఎదుర్కోలేక‌పోయాను. ఇక అదే చివ‌రి మ్యాచ్ అని అనుకున్నా.. స‌రిగ్గా అప్పుడే ర‌విశాస్త్రి నాకు స‌ల‌హా ఇచ్చారు. క్రీజ్‌లో ఎక్కువ స‌మ‌యం ఉండేందుకు ప్ర‌య‌త్నించాల‌ని చెప్పారు. ఇక అప్ప‌టి నుంచి నా ఆలోచ‌నా విధానంలో మార్పు వ‌చ్చింది. ఆయ‌న ఇచ్చిన స‌ల‌హాప్ర‌కారం క్రీజ్‌లో ఎక్కువ స‌మ‌యం ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నా* అని స‌చిన్ టెండూల్క‌ర్ త‌న కెరీర్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఇక ఎన్న‌డూ వెన‌క్కితిరిగి చూడ‌కుండా.. రారాజులా క్రికెట్‌ను ఏలాడు స‌చిన్‌. 

మరింత సమాచారం తెలుసుకోండి: