ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుత విద్యా సంవ‌త్స‌రంలో విద్యార్థులు అనేక ఒడిదుడుకులు ఎదుర్కోక త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఇప్ప‌టికే ప‌దో త‌ర‌గ‌తి మిన‌హా మిగిలిన అన్ని త‌ర‌గుత‌ల విద్యార్థులు పాస్ అయ్యి పై త‌ర‌గుతుల‌కు ప్ర‌మోట్ అవుతున్న‌ట్టు అటు తెలంగాణ‌తో పాటు ఇటు ఏపీ ప్ర‌భుత్వం కూడా ప్ర‌క‌టించేసింది. ఇక ఇప్పుడు వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రం ప‌రిస్థితి ఏంట‌న్న‌ది ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌డం లేదు. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో క‌రోనా ప్ర‌భావం ఆగ‌స్టు వ‌ర‌కు ఉండేలా ఉంది. 

 

ఉన్న‌త విద్య ప‌రంగా చూస్తే ఈ క్ర‌మంలోనే ఏపీలో 2020-21 విద్యా సంవత్సరం ఈ ఏడాది సెప్టెంబరు నుంచి ప్రారంభించే అవకాశం ఉంది. అనివార్యంగా పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాల్సిన పరిస్థితి రానుంది. ఈ అంశాలపై యూజీసీ పరిశీలన జరుపుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 2019-20 విద్యా సంవత్సరం ముగిసినట్లే. ఇక ఉన్నత, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు.  

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: