ప్ర‌యాణికులకు ఎప్పటిక‌ప్పుడు మెరుగైన సేవ‌లు అందించేందుకు భార‌తీయ రైల్వే శాఖ అనేక ప్ర‌య‌త్నాలు చేస్తోంది. అందుబాటులో సాంకేతిక ప‌ద్ధ‌తుల‌ను వినియోగించుకుంటోంది. ఇప్ప‌టికే మ‌నం ప్ర‌యాణించాల్సిన రైలు ఎక్క‌డ ఉంది..?  ఎక్క‌డి దాకా వ‌చ్చింది..? స‌్టేష‌న్‌కు ఎప్పుడు వ‌స్తుంది..? త‌దిత‌ర అంశాల‌ను తెలుసుకునేలా యాప్‌ను కూడా విడుద‌ల చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా.. దేశం మొత్తం ఒక‌టే కొత్త స‌పోర్ట్ నంబ‌ర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆలిండియా ఎంక్వైరీ నంబ‌ర్‌139ను తీసుకొచ్చింది. ఇక రైల్వేకు సంబంధించిన ఎలాంటి స‌మ‌స్య‌ల‌నైనా నివేదించేందుకు, స‌మాచారం తెలుసుకునేందు ఈ నంబ‌ర్‌కు కాల్ చేస్తే చాలు.

 

స్టేష‌న్ రైలు ఏ స‌మ‌యానికి వ‌స్తుంది..? ఏ స‌మ‌యానికి బ‌య‌లుదేరుతుంది..? ఇలా ఏ స‌మాచార‌మైన 139కు కాల్ చేసి తెలుసుకోచ్చు. రైళ్ల రాక‌పోక‌ల గురించి మ‌నం హెల్ప్ లైన్ నంబ‌ర్ 139కు కాల్ చేస్తే.. వెంట‌నే మ‌న‌కు కావాల్సిన మొత్తం స‌మాచారం అందుతుంద‌ని రైల్వేవ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ మేర‌కు ప‌శ్చిమ రైల్వే శాఖ హైల్ఫ్‌లైన్ నంబ‌ర్‌తో రూపొందించిన పోస్ట‌ర్‌ను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. ఇక్క‌డ మ‌రొక విష‌యం ఏమిటంటే.. ఈ నంబ‌ర్‌కుకాల్ చేయాలంటే.. ఇంట‌ర్నెట్ అవ‌స‌రం లేదు. 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: