దేశంలో కరోనా వ్యాప్తి వల్ల ఎన్ని అనార్థాలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా లాక్ డౌన్ సందర్భంగా ఎక్కడి వారు అక్కడే ఇరుక్కుపోయారు.  విదేశాల్లో ఉన్నవారే కాదు.. దేశంలో వలస బాట పట్టిన వారు.. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు అక్కడే ఉండిపోయారు.  వాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా స్వస్థలం రాలేకపోాతున్నారు.  తాజాగా తమ స్వస్థలాలకు చేరాలని భావించి, ఓ ఖాళీ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ తో డీల్ కుదుర్చుకుని మహారాష్ట్ర నుంచి బయలుదేరిన 20 మంది తెలంగాణ విద్యార్థులను అధికారులు పట్టుకున్నారు.  ఈ ఘటన నాందేడ్ లో చోటు చేసుకుంది. 

 

వివరాల్లోకి వెళితే.. మరాఠ్వాడా ప్రాంతంలో తెలంగాణకు చెందిన దాదాపు 20 మంది వ్యవసాయ కోర్సులను అభ్యసిస్తున్నారు.  గత నెల 24 నుంచి లాక్ డౌన్ కారణంగా వారి కళాశాలకు సెలవు ఇచ్చారు.. దాంతో తమ స్వస్థలానికి చేరుకోవాలని నానా తంటాలు పడుతున్నారు.

 

అక్కడ తినడానికి తిండిలేక అల్లాడిపోతూ, కాస్తంత ధైర్యం చేసైనా, తమ ప్రాంతాలకు వెళ్లిపోవాలని భావించారు. అయితే ఓ ఖాళీ ట్యాంకర్ లో ప్రవేశించా ఎలాగో అలా 165 కి.మీ. ప్రయాణించారు.. కానీ బ్యాడ్ లక్ నాందేడ్ సమీపంలో పోలీసులు చేస్తున్న తనిఖీల్లో దొరికిపోయారు. వీరందరినీ క్వారంటైన్ కు తరలించామని అధికారులు వెల్లడించారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: