లాక్ డౌన్ కార‌ణంగా దేశ‌వ్యాప్తంతా ర‌వాణా వ్య‌వ‌స్థ స్తంభించింది. ప్ర‌జలంతా ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు. దీంతో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో బ‌య‌ట‌కు వెళ్లేందుకు కొన్ని ఇబ్బందులు తప్ప‌డంలేదు. ముఖ్యంగా గ‌ర్బిణులు స‌మ‌యానికి ద‌వాఖాన‌కు వెళ్ల‌డం ప్ర‌హ‌స‌నంగా మారింది. ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి తాజాగా అస్సాం లో వెలుగు చూసింది.

అస్సాంలోని ధేమాజీ జిల్లాలోని ఉదయపూర్ మేచకి సపోరి ప్రాంతంలో ఒక మహిళ నాటు పడవలో మ‌గ బిడ్డను ప్రసవించింది. సపోరి (ద్వీప గ్రామం) వద్ద ఆరోగ్య శిబిరం నిర్వహించేందుకు ధేమాజీ నుంచి నాటు ప‌డ‌వ‌లో వైద్యాధికారులు క్లినిక్ వెళ్తున్నారు.  అయితే పురిటి నొప్పుల‌తో మ‌హిళ బాధ‌‌ప‌డు తోంద‌నే స‌మాచారం మేర‌కు వైద్య బృందం గ్రామానికి చేరుకుంది. అప్ప‌టికే సమయం మించిపోవ‌డంతో, ద‌వాఖాన‌కు త‌ర‌లించ‌కుండా.. పడవలో మ‌హిళ డెలివ‌రీకి త‌గిన ఏర్పాట్లు చేశారు.  ఆరోగ్య కార్యకర్తలు శ్ర‌మించి, అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంతో ప‌డ‌వ‌లోనే  మ‌హిళ పండంటి మ‌గ బిడ్డ‌కు జ‌న్మ నిచ్చింది. దీంతో అధికారులు, గ్రామ‌స్తులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: