కోవిడ్ -19 వ్యాప్తి నివార‌ణ‌కు మాస్క్‌లు ధరిస్తున్నామ‌ని, ముందుముందు ఇవి మ‌న జీవితంలో భాగ‌మైన పోతాయని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ అన్నారు. మాస్క్‌లు ధ‌రించ‌డం ద్వారా అంటువ్యాధి విచ్ఛిన్నమవుతుందని ఆయ‌య‌న పేర్కొన్నారు. అందుకే మాస్క్‌లు నాగ‌రిక స‌మాజానికి చిహ్నాలుగా మారుతాయ‌ని ప్ర‌ధాని చెప్పారు. క‌రోనా మహమ్మారి కారణంగా ప్రజలు బహిరంగంగా ఉమ్మివేయడం మానేశారని ఆయన అన్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఈ రోజు ఉద‌యం 11గంట‌ల‌కు మ‌న్‌కీబాత్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి, క‌ట్ట‌డి చ‌ర్య‌లు, లాక్‌డౌన్ అమ‌లుపై ఆయ‌న మాట్లాడారు.

 

ఈ సంద‌ర్బంగా ఆయన మాస్క్‌లు ధ‌రించ‌డంపై ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్పారు.  క‌రోనా వైర‌స్‌పై యుద్ధం కొన‌సాగుతోంద‌ని, భార‌త్ ఒక్క‌టిగా చేస్తున్న యుద్ధాన్ని ప్ర‌పంచ గ‌మ‌నిస్తోంద‌ని ఆయ‌న అన్నారు. క‌రోనాపై పోరాటంలో ప్ర‌తీ పౌరుడు ఒక సైనికుడేన‌ని ఆయ‌న పేర్కొన్నారు. క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి  ఈ దేశాన్ని విముక్తి చేయ‌డానికి వైద్యులు, న‌ర్సులు.. క‌మ్యూనిటీ హెల్త్‌వ‌ర్క‌ర్లు అంద‌రూ పోరాడుతున్నార‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ కొనియాడారు. వారిపై వివ‌క్ష‌ను తీవ్రంగా ప‌రిగ‌ణిస్తామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: