ప్రపంచంలో కరోనాని అరికట్టేందు ఎన్ని రకాల కట్టుదిట్టాలు చేయాలో చేస్తున్నారు.  ప్రతిరోజూ  ఈ కరోనా కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి.  ముఖ్యంగా అమెరికాల లాంటి పెద్ద దేశాల్లో ఇప్పటికే 50 వేల మరణాలు దాటిపోయాయి.  ఇక దేశ వ్యాప్తంగా రెండు లక్షల మంది చనిపోయారంటే కరోనా తీవ్రత ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది.  ఐతే కరెనా వ్యాప్తి అరికట్టడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  దాని వల్ల కరోనా ని అరికట్టవొచ్చని అంటున్నారు.

 

  అయితే లాక్‌డౌన్‌తో ఇళ్లల్లో మగ్గుతున్న ప్రజలు అక్కడక్కడా విసుగెత్తిపోతున్నారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు కూడా లభించక రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు. మరోవైపు వలస కూలీల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.  ఇక కొంత మంది మందు బాబుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు.. పిచ్చివారై పోతున్నారు.  ఈ క్రమంలో జర్మనీ ప్రజలు లాక్‌డౌన్‌తో సహనం కోల్పోయారు. మార్చి 17 నుంచి అక్కడ లాక్‌డౌన్ అమలులో ఉంది. అయితే లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా జర్మనీలో ప్రజలు నిరసనకు దిగుతున్నారు.   

 

కొందరు పోలీసులతో ఘర్షణ పడుతున్నారు. నిరసన తెలుపటం రాజ్యాంగ హక్కు అంటూ నినాదాలు చేయడంతో ఆ ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది. నిరసన తెలుపటం రాజ్యాంగ హక్కు అంటూ నినాదాలు చేయడంతో ఆ ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది.   కాగా, లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన దాదాపు 100 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: