ఆంధ్ర‌ప్రదేశ్‌లో క‌రోనా క‌ల‌క‌లం రేపుతోంది. వైర‌స్ మ‌హ‌మ్మారి చాప కింద నీరులా వైర‌స్ విస్త‌రిస్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌క‌డ్బందీ చ‌ర్య‌లు తీ సుకుంటున్నా... అంత‌కంత‌కూ పాజిటివ్ కేసులు న‌మోదవుతున్నాయి. దీంతో సీఎం జ‌గ‌న్ మ‌రింత అప్ర‌మ‌త్తం అయ్యారు. ఈనేప‌థ్యంలోనే  కరోనా పరీక్షల సంఖ్య మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.  కోవిడ్‌–19 నివారణ చర్యలతో పాటు,  వైరస్‌ వ్యాప్తిని నియంత్రణపై ఆదివారం ఆయన  తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఉన్నతాస్థాయి సమీక్ష నిర్వహించారు. 

 

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులపై ఈ సమావేశంలో చర్చించారు.  ప్రతి జిల్లాలోనూ టెస్టింగ్‌ ల్యాబ్‌ ఏర్పాటుకు చర్యలు ముమ్మరం చే యాలని సీఎం జగన్ అధికారుల‌ను ఆదేశించారు.  కేసుల సంఖ్య పెరుగుత‌న్న నేప‌థ్యంలో అన్ని జిల్లాల్లో క‌రోనా వైర‌స్‌ను నిర్దారించే ల్యాబ్‌లు ఉండాల‌ని ఆయ‌న ఆదేశించారు.  అలాగే రెడ్‌ జోన్లులో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూ చించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: