దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం విపరీతంగా పెరిగిపోతుంది.  ఈ నేపథ్యంలో కరోనాని కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించారు.  లాక్ డౌన్ ప్రభావం టీటీడీ ఆదాయంపైన పడిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో టీటీడీ ఫిక్స్ డ్ డిపాజిట్లను బయటకు తీయాల్సి వస్తుందంటూ వస్తున్న వార్తలపై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. గత వంద సంవత్సరాల్లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో రాలేదని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కరోనా విషయంలో ముఖ్యంగా టీటీడీ విషయంలో కొంత మంది రూమర్లు సృష్టిస్తున్నారని అన్నారు. 

 

 కలియుగ దైవం వెంకటేశ్వరుడు అటువంటి పరిస్థితి రానీయ డని తాను భావిస్తున్నానని అన్నారు.  ఎవరూ అపోహలకు తావివ్వొద్దని అననారు.  అలాంటి పరిస్థితి తలెత్తకుండా చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు.  ‘కరోనా’, ‘లాక్ డౌన్’ నేపథ్యంలో భక్తులకు దర్శనాలు ఆపేసి ఇప్పటికి నలభై ఐదు రోజులు అయిందని అన్నారు.   ప్రతి నెలా వచ్చే హుండీ ఆదాయం, సేవా కార్యక్రమాలు, కల్యాణోత్సవాలు, ప్రసాదాలు, రూమ్ రెంట్స్.. ఇలా వీటి ద్వారా వచ్చే ఆదాయం సుమారు రూ.150 నుంచి రూ.175 కోట్ల వరకు ఉంటుందని అన్నారు.  

 

లాక్ డౌన్ నేపథ్యంలో తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనులు లేని వలస కార్మికులకు, నిరాశ్రయులకు, యాచకులకు ఎటువంటి ఇబ్బంది పడకుండా రోజూ రెండు పూట్ల భోజనం పెడుతున్నామని, సుమారు 65 నుంచి 70 వేల మందికి అన్నప్రసాదం అందజేశామని  అన్నారు.  రాబోయే కాలంలో టీటీడీ ఖర్చులు, వ్యయాలు తగ్గించే విషయమై అధికారులు, ఉద్యోగస్తులు, పాలక మండలి సభ్యులు సహకరిస్తారని ఆశించారు. పాలక మండలి సభ్యులు, చైర్మన్ గా తాను జీతాలు తీసుకోలేదని గుర్తుచేశారు. తిరుమలేశుడు అందరినీ రక్షిస్తారని అన్నారు. 

 


కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: