క‌రోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు అనేక దేశాలు లాక్‌డౌన్‌నే న‌మ్మ‌కుంటున్నాయి. లాక్‌డౌన్‌ను విధించి, ప్ర‌జ‌లు సామాజిక దూరం పాటించేలా చ‌ర్య‌లు తీసుకుంటే క‌రోనా వ్యాప్తిని సుల‌భంగా నివారించ‌వ‌చ్చున‌న్న న‌మ్మ‌కంతో ముందుకు వెళ్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప‌లు దేశాలు లాక్‌డౌన్‌ను మ‌ళ్లీమ‌ళ్లీ పొడిగిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే క‌‌రోనా వైర‌స్ పై పోరు చేసేందుకు నేపాల్ దేశం కూడా లాక్ డౌన్ కాలాన్ని పొడిగించింది. లాక్ డౌన్ 10 రోజుల‌పాటు  మే 7 వ‌ర‌కు లాక్ డౌన్‌ను పొడిగిస్తున్న‌ట్లు నేపాల్ ప్ర‌ధాని సెక్ర‌టేరియ‌ట్ కార్యాల‌యం వెల్ల‌డించింది. మినిస్ట‌ర్స్ కౌన్సిల్ ఈరోజు స‌మావేశ‌మై ఈమేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పేర్కొంది.

నిజానికి..  ఏప్రిల్ 27న లాక్ డౌన్ ముగియాల్సి ఉండ‌గా..తాజా నిర్ణ‌యంతో బుద్ధ జయంతి రోజున లాక్ డౌన్ ను ఎత్తివేయ‌నుంది నేపాల్ ప్ర‌భుత్వం.  కాగా, నేపాల్ లో ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 52 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా..16 మంది కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేదు. అయితే.. ఇటీవ‌లి నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీంతో మ‌ళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: