వ‌య‌సు పెరుగుతున్నా‌... వ‌న్నె త‌ర‌గ‌ని అందంతో వెండి తెర‌పై వెలిగిపోతోంది బొద్దుగుమ్మ న‌య‌న‌తార‌..  మూడు పదుల వయస్సులోనూ ఈ అమ్మ‌డు త‌న  అంద ‌చందాల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్ట‌కుంటోంది.  చీరకట్టులో సంప్రదాయబద్ధంగా కనిపించినా, బికినీలో అభిమానులకు కనువిందు చేసినా ఆమెకే చెల్లింది. అయితే  సూపర్ స్టార్‌ హీరోయిన్‌గా దూసుకుపోతున్న నయనతార... త‌న సినీ రంగ ప్ర‌వేశంపై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అసలు సినిమాలంటే త‌న‌కు ఇష్టం లేద‌ని, ఇష్టం లేకుండానే సినిమాల్లోకి వచ్చాన‌ని చెబుతోంది.


‘‘నిజమే. నాకు సినిమాలంటే ఇష్టం లేదు. ఇంక నటన అంటే ఏకోశానా ఆసక్తి, ఇష్టమూ రెండూ లేవు. చదువుకుంటూనే మోడలింగ్‌ చేసేదాన్ని. 2003లో ఓ మలయాళీ సినిమాలో అవకాశమొచ్చింది. ముందు చేయననే అన్నాను. కానీ ఆ సినిమా దర్శకనిర్మాతలు నచ్చచెప్పడంతో ఒక్క సినిమా మాత్రమే చేయాలని నిర్ణయించుకుని ఆ సినిమా చేశాను. ఆ సినిమాలో నా నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. సినిమా కూడా మంచి వసూళ్ళను రాబట్టింది. ఆ సంవత్సరంలో దాదాపు ఎనిమిది సినిమాలకు ఓకే చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాను. ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో అన్ని రకాల పాత్రలు పోషించాను..’’ అని నయనతార చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: