ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై అనేక వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో దక్షిణ కొరియా అధ్యక్షుడి భద్రతా సలహాదారు మూన్‌ చుంగ్‌ ఇన్ స్పందించారు. ఆ వార్త‌ల‌ను కొట్టిపారేశారు. కిమ్‌ బతికే ఉన్నారని, అతని ఆరోగ్యానికి ఢోకా లేదని వెల్లడించారు. సీఎన్‌ఎన్‌కు ఇచ్చిన ప్ర‌త్యేక‌ ఇంటర్య్యూలో ఆయన మాట్లాడుతూ.. త‌మ‌ ప్రభుత్వం అన్ని పరిస్థితులను నిశితంగా గమనిస్తోందని పేర్కొన్నారు. ఉత్తర కొరియాకు తూర్పున ఉన్న‌ ఉన్నత ప్రాంతంలోని వాన్‌సన్‌లో కిమ్‌ ఏప్రిల్‌ 13 నుంచి ఉంటున్నట్టు చుంగ్‌ ఇన్‌ తెలిపారు. అతని ఆరోగ్యంపై గాని, మరే విషయాల్లో గాని ఎలాంటి అనుమానాస్పద కదలికలు లేవని అన్నారు.

 

కాగా, ఏప్రిల్‌ 11 జరిగిన తమ పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో పాల్గొన్న కిమ్ ఆత‌ర్వాత మ‌ళ్లీ క‌నిపించ‌లేదు. అయితే, ఫైటర్‌ జెట్‌ విమానాలను పరిశీలించేందు కిమ్‌ వెళ్లాడని ఆ దేశ మీడియా తెలిపింది. ఈ క్రమంలో ఏప్రిల్‌ 15న కిమ్‌ తన తాత ఇల్‌ సంగ్‌ 108 జయంతి వేడుకల్లో కూడా పాల్గొన‌లేదు. ఇక అప్ప‌టి నుంచే ఆయ‌న‌ ఆరోగ్యం బాగోలేద‌న్న ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. నిజానికి.. ఉత్తర కొరియాకు అత్యంత ముఖ్యమైన ఈ వేడుకలకు కిమ్‌ 2011లో అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. ఈసారి మాత్రం హాజ‌రుకాక‌పోవ‌డంతో ఈ వ‌దంతులు మొద‌ల‌య్యాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: