భారతదేశంలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం రోజురోజుకూ పెరిగిపోతోంది. గ‌త 24 గంట‌ల్లో 48మంది మృతి చెంద‌గా.. కొత్త‌గా 1394 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో‌ మొత్తం కొవిడ్ -19 కేసులు 27,892 న‌మోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా 20,835 యాక్టివ్‌ కేసులు ఉండగా, 6,184 మంది క‌రోనా బారి నుంచి కోలుకున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 872 మంది క‌రోనాతో మృతి చెందారు. ఇదిలా ఉండ‌గా.. రాష్ట్రాల్లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చ‌ర్య‌లు, లాక్‌డౌన్‌పై చ‌ర్చించేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఈరోజు ముఖ్య‌మంత్రుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హిస్తున్నారు.

 

ఇందులో ప్ర‌ధానంగా మే 3వ తేదీ త‌ర్వాత తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై చ‌ర్చించే అవ‌కాశాలు ఉన్నాయి. రోజురోజుకూ క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో లాక్‌డౌన్‌ను కొన‌సాగించాలా వ‌ద్దా.. అనే అంశం అత్యంత కీల‌కంగా మారుతుంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే.. రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్ జోన్ల‌వారీగా లాక్‌డౌన్ నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: