తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా జరుపుకుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాదులోని టీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు.  సరిగ్గా రెండు దశాబ్ధాల కిందట 2001 ఏప్రిల్‌ 27న గులాబీ పార్టీని ప్రకటించారు కేసీఆర్‌. 20 ఏళ్లు పూర్తికావడంతో.. ఇవాళ తెలంగాణ భవన్‌లో పార్టీ ఆవిర్భావ వేడులకు చాలా సింపుల్‌గా నిర్వహించారు..  కరోనా ఎఫెక్ట్‌తో కొద్ది మంది నేతలను మాత్రమే టీఆర్ఎస్ కార్యాలయంలోకి అనుమతించారు.. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నమస్కరించిన గులాబీ అధినేత కేసీఆర్.. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి నివాళులర్పించారు. 

 

రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని సాధించడంతో పాటు, తెలంగాణలో అన్ని రంగాల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయాలను సాధించిందని చెప్పారు. దేశానికే ఆదర్శంగా నిలిచేలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు.అయితే, జెండా ఆవిష్కరించిన వెంటనే తెలంగాణ భవన్‌ నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు సీఎం కేసీఆర్, మంత్రులు, నేతలు... ఈ కార్యక్రమంలో నేతలు సామాజిక దూరాన్ని పాటిస్తూ పాల్గొన్నారు. 

 

కాగా, పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాల్సి ఉన్నప్పటికీ... కరోనా కారణంగా నిరాడంబరంగా నిర్వహించుకోవాలని నిర్ణయించినట్టు కేసీఆర్ తెలిపారు.  కరోనా నేపథ్యంలో ప్రభుత్వం విధించిన అన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాలని  ఆదేశించారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: