లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమిత‌మైన రైల్వే  ఉద్యోగులు, పెన్షనర్లకు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఈ రోజు నుంచి మందుల డోర్‌ డెలివరీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ డివిజన్‌ పరిధిలోని 15 వేల మంది రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లకు ఇంటింటికీ మందులు సరఫరా చేయాలని నిర్ణయించింది. అయితే.. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో మందులను అధికారులు డోర్‌ డెలివరీ చేయ‌నున్నారు. దీనికోసం మొత్తం ఆరు వాట్సాప్‌ నంబర్లను ఏర్పాటు చేశారు. సోమ, బుధ, శుక్రవారాల్లో 75693 05668, 76759 28721, 75693 05636 వాట్సాప్‌ నంబర్లకు, మంగళ, గురు, శనివారాల్లో 76739 27677, 75693 05620, 70138 26171 వాట్సాప్‌ నంబర్లకు సమాచారం ఇస్తే రైల్వే ఉద్యోగులు, పెన్షనర్లు మందులను ఇంటికి ఆర్డర్‌ చేయవచ్చు.

 

మెడిసిన్ అవ‌స‌రం ఉన్న‌ ఉద్యోగులు, పెన్షనర్లు సంబంధిత వాట్సాప్ నంబర్‌ కు వారి మెడికల్ ఐడీ కార్డు, చివరిసారిగా తీసుకున్న డాక్టర్ ప్రిస్క్రిప్షన్, మొబైల్ నంబర్, ప్రస్తుత చిరునామాలను పంపాలి. ఆ త‌ర్వాత వీటిని రైల్వే వైద్య విభాగం పరిశీలించి మందులు పంపుతుంది. ప్రధానంగా డయాబెటీస్, హైపర్ టెన్షన్, గుండె జబ్బుల రోగులకు మందులను పంపుతారు. అలాగే.. టెలీ మెడిసిన్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: