దేశంలో క‌రోనా విజృంభిస్తున్న వేళ‌.. లాక్ డౌన్ కొన‌సాగుతున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇవాళ ఉద‌యం ప‌ది గంట‌ల‌కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. లాక్ డౌన్ విధించిన త‌ర్వాత నాలుగో సారి ప్ర‌ధాని మోడీ ఆయా రాష్ట్రాల సీఎంల‌తో వీడియో కాన్ప‌రెన్స్ నిర్వ‌హించారు.  క‌రో నా క‌ట్ట‌డి చ‌ర్య‌లు, లాక్‌డౌన్ పొడిగింపు, ఆంక్ష‌ల స‌డ‌లింపు త‌దిత‌ర అంశాల‌పై ఆయ‌న స‌మీక్షించారు.

 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు అన్ని రాష్ట్రాల సీఎంలు, ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొ న్నా రు. కరోనా కట్టడికి మరి కొన్నాళ్ల‌పాటు లాక్‌డౌన్ ను కొనసాగించడమే మేలని పలువురు ముఖ్య‌మంత్రులు అభిప్రాయం వ్య‌క్తం చేశాయి. అంతేగాక లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా చాలా నష్టపోయామ‌ని, ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి ఆదుకోవాల‌ని మ‌రి కొంద‌రు  ప్రధానిని కోరారు.

 

అయితే ప్ర‌ధాని నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్‌కు కేర‌ళ సీఎం విజ‌య‌న్ హాజ‌రుకాలేదు.  ఆ రాష్ట్రం త‌రుపున ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హాజ‌రయ్యారు. అయితే ఇప్ప‌టికే త‌మ అభిప్రాయాన్ని కేంద్రానికి రాత పూర్వ‌కంగా అంద‌జేశామ‌ని కేర‌ళ ప్ర‌భుత్వ వ‌ర్గాలు ప్ర‌క‌టించాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: