ఢిల్లీలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావం రోజురోజుకూ తీవ్ర‌రూపం దాల్చుతోంది. ప్ర‌ధానంగా కరోనా పేషెంట్ల‌కు వైద్య‌సేవ‌లు అందిస్తున్న సిబ్బంది వైర‌స్ బారిన ప‌డుతున్నారు. ఈ సంఖ్య రోజురోజుకూ ఎక్కువ అవుతోంది. తాజాగా.. ఒకే న్యూఢిల్లీలోని మాక్స్ హాస్పిటల్‌లో ఏకంగా 33మంది వైద్య‌సిబ్బంది వైర‌స్ బారిన‌ప‌డ్డారు. ఇందులో వీరిలో ఇద్దరు వైద్యులు, 23 మంది నర్సింగ్ సిబ్బంది ఉన్నారు, సాంకేతిక నిపుణులు, సహాయక సిబ్బంది ఉన్నారు. వీరందరినీ మా కొవిడ్ -19 మాక్స్ హాస్పిటల్, సాకేత్‌, ఈస్ట్ వింగ్ వద్ద ఉన్న ఆసుపత్రికి తరలించారు. పట్పర్‌గంజ్‌లోని మాక్స్ హాస్పిటల్‌కు చెందిన 145 మంది నర్సులను వారు నివసిస్తున్న ఒక ప్రైవేట్ హాస్టల్‌లో 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచారు.

 

హాస్టల్‌కు సీలు వేసి స్థానిక అధికారులు కంటైన్మ‌నెంట్‌ జోన్‌గా ప్రకటించారు. అయితే.. అందుబాటులో ఉన్న సిబ్బందితో ఆస్ప‌త్రిలో వైద్య‌సేవలు అందిస్తున్నారు. రోజురోజుకూ క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డుతున్న‌వారి సంఖ్య పెరుగుతుంద‌డంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదిలా ఉండ‌గా.. నిన్న ప‌శ్చిమ‌బెంగాల్‌లో వైద్యారోగ్య‌శాఖ ఉన్న‌తాధికారి కూడా క‌రోనా బారిన ప‌డి మృతి చెందిన విష‌యం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: