దేశంలో అత్య‌ధిక క‌రోనా పాజిటివ్‌ కేసులు మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, ఢిల్లీలో న‌మోదు అవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం వివ‌రాలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్ర నుండి 8,068, గుజరాత్- 3,301, ఢిల్లీ- 2,918, రాజస్థాన్- 2,185, మధ్యప్రదేశ్- 2,096, తమిళనాడు- 1,885 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. ఉత్తర ప్రదేశ్‌లో 1,868, ఆంధ్రప్రదేశ్‌లో 1,097, తెలంగాణలో 1,002 కేసులు న‌మోదు అయ్యాయి. ఇక ఇదే వ్యాప్తంగా గ‌త 24 గంట‌ల్లో 48మంది మృతి చెంద‌గా.. కొత్త‌గా 1394 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో‌ మొత్తం కొవిడ్ -19 కేసులు 27,892 న‌మోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా 20,835 యాక్టివ్‌ కేసులు ఉండగా, 6,184 మంది క‌రోనా బారి నుంచి కోలుకున్నారు.

 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 872 మంది క‌రోనాతో మృతి చెందారు.  తాజాగా.. బెంగ‌ళూరులో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. 50 ఏళ్ల కోవిడ్ -19 రోగి  ఆత్మహత్య చేసుకున్నాడు. క‌రోనా బారిన‌ప‌డి చికిత్స పొందుతున్న వ్యక్తి బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్ ఫైర్ ఎగ్జిట్ విండో నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌తో స్థానికంగా విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: