టాలీవుడ్ స్టార్ మహేష్ బాబుతో  '1 నేనొక్కడిన'  లో జతకట్టిన బాలీవుడ్ భామ కృతి సనన్ పేరు దాదాపుగా తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఆ సినిమాలో కుర్ర కారును తన అందాలతో ఆకట్టుకున్నది కృతి సనన్. గత కొంతకాలంగా బాలీవుడ్ లో బిజీగా అయిపోయింది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా చాల ఖాళీగా ఉంటుంది ఈ అమ్మడు. ఎందుకో అందరికీ తెలిసిందే కాబట్టి మరోసారి చెప్పుకోవలసిన అవసరం లేదు.

IHG

మనం ఖాళీగా ఉన్నాము కదా అని ఓ పదేళ్ల క్రితం ఫోన్ నెంబర్ ను ఫోన్ బుక్ ను క్రిందకు దించి దుమ్ముదులిపి బయటకు తీసి ఫోన్ చేసి 'బాగున్నారా... బాగున్నారా' అని అదేదో సినిమాలో ఆలీ లా వేధించకుండా మరోరకంగా టైం పాస్ చేస్తుంది ఈ అమ్మడు.  తాజాగా కృతి సనన్ సోషల్ మీడియాలో తన అందచందాలను కొత్తగా చూపించే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి  తెగ చక్కెర్లు కొడుతోంది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముంది అని అంటారా.... ఆ ఫోటో లో కృతి సనన్ సీతాకోకచిలుకల  ట్యాటూ  లతో  తాను అచ్చంగా సీతాకోకచిలుక మాదిరిగానే మారిపోయింది  అన్నట్లుగా ఆ ఫోటోలో ఆమె సోయగం ఉంది.ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది...

మరింత సమాచారం తెలుసుకోండి: