కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ మే 3తో ముగియనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ ముగిసింది.  దేశంలో క‌రోనా విజృంభిస్తున్న వేళ‌..  ప్ర‌ధాని మోడీ ఇవాళ ఉద‌యం ప‌ది గంట‌ల‌కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. లాక్ డౌన్ విధించిన త‌ర్వాత నాలుగో సారి ప్ర‌ధాని మోడీ ఆయా రాష్ట్రాల సీఎంల‌తో వీడియో కాన్ప‌రెన్స్ ని ర్వ‌హించారు.  క‌రోనా క‌ట్ట‌డి తీసుకుంటున్న చ‌ర్య‌లు, లాక్‌డౌన్ పొడిగింపు, ఆంక్ష‌ల స‌డ‌లింపు త‌దిత‌ర అంశాల‌పై ఆయ‌న సుదీర్ఘంగా స‌మీక్షించారు. సుమారు రెండున్న‌ర గంట‌ల‌కుపైగా ఈ వీడియో కాన్ప‌రెన్స్ జ‌రిగింది. 

 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు తొమ్మిది రాష్ట్రాల సీఎంలు, ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొ న్నారు. కరోనా కట్టడికి మరి కొన్నాళ్ల‌పాటు లాక్‌డౌన్ ను కొనసాగించడమే మేలని పలువురు ముఖ్య‌మంత్రులు అభిప్రాయం వ్య‌క్తం చేశాయి. అంతేగాక లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా చాలా నష్టపోయామ‌ని, ఆర్థిక ప్యాకేజీని ప్రకటించి ఆదుకోవాల‌ని మ‌రికొంద‌రు ప్రధానిని కోరారు. ఈసంద‌ర్భంగా మోడీ మాట్లాడుతూ క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌లు బాగానే ప‌నిచేస్తున్నాయ‌న్నారు. లాక్‌డౌన్ తో క‌రోనా కేసులు కూడా త‌గ్గించ‌గ‌లిగామ‌ని అన్నారు. అంతేగాక వ‌ల‌స కూలీల‌కు అందుతున్న సాయంపై కూడా ముఖ్య‌మంత్రుల‌ను అడిగి తెలుసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: