కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ మే 3తో ముగియనుంది. ఈనేప‌థ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ‌ ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. సుమారు రెండున్న‌ర గంట‌ల‌పాటు ఈ స‌మావేశం జ‌రిగింది.  వైరస్ ఉధృతి కొనసాగుతున్న తరుణంలో లాక్‌డౌన్‌ను కొనసాగించాలని మెజార్టీ రాష్ట్రాలు పీఎంను కోరాయి. మరో వైపు దేశ వ్యాప్తంగా రోజు రోజుకూ కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. మృ త్యుల సంఖ్యా 1000కి చేరువులో ఉంది. ఈనేపథ్యంలో ప్రధాని మోడీ లాక్‌డౌన్‌పై ఎలాంటి నిర్ణయంపై తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. 

ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కరోనా కట్టడికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటోన్న చర్యలను ప్రధాని అడిగి తెలుసుకుంటున్నారు. ఇవాళ్టి వీడియో కాన్ఫరెన్స్‌లో లాక్‌డౌన్ పొడిగింపుపై మెజారిటీ సీఎంల సూచనల మేరకు ప్రధాని నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో సారి జాతినుద్దేశించి ప్రసంగించ నున్నారు. ఈ వారాంతం (శ‌ని లేదా ఆదివారం) లో ఆయన ప్రసంగిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. లాక్‌డౌన్ కొన‌సాగింపుపై మోడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంద‌ని ఆ వ‌ర్గాలు పేర్కొన్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: