ప్రపంచం ఇప్పుడు కోవిడ్ -19 వైరస్ గుప్పిట చిక్కుకొని ఉంది. ప్రపంచ వ్యాప్తంగా రెండు లక్షల మరణాలు సంబవించాయి.. లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి.  ప్రపంచ దేశాల్లో ఇప్పుడు ప్రతి ఒక్కరూ మాస్క్ లు ధరిస్తున్నారు.. ఒకప్పుడు కాలుష్యాన్ని అరికట్టేందుక మాస్కులు వాడేవారు.. కానీ ఇప్పుడు కరోనాని అరికట్టేందుకు మాస్కులు వాడుతున్నారు.  సామాజిక దూరం తప్పని సరి అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడిన విషయం తెలిసిందే.  కరోనా నివారణ చర్యలు, వైరస్ వ్యాప్తి తీరుతెన్నులు, రాష్ట్రాల్లో లాక్ డౌన్ పరిస్థితులపై ఆయన సీఎంలతో మాట్లాడారు.  

 

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ప్రస్తుతం పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉందని, సామాన్యులను ఆకట్టుకునేలా సంస్కరణలు తీసుకురావాలని సూచించారు.  ఓవైపు కరోనాపై పోరాటం చేస్తూనే మరోవైపు ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవంపైనా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.   సీఎంలు తమ రాష్ట్రాల్లో కరోనా కేసుల తగ్గింపునకు కృషి చేయాలని, రెడ్ జోన్లను ఆరెంజ్ జోన్లుగా, ఆరెంజ్ జోన్లను గ్రీన్ జోన్లుగా మార్చేందుకు శ్రమించాలని పిలుపునిచ్చారు.

 

కరోనా వైరస్ ప్రభావం మున్ముందు కొన్ని నెలల పాటు ఉంటుందని, మాస్కులు, ఇతర కవచాలు మన నిత్యజీవితంలో భాగం కావాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎవరై బయటకు వచ్చినా తప్పని సరిగా మాస్కులు ధరించాలని సూచించారు.  కరోనా వైరస్ ప్రబల కుండా భారతీయులు ఎంతో కష్టపడుతున్నారని.. కొన్నాళ్లు పోరాడితే మనదే విజయం అని అన్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: