ఏ దుర్మూహూర్తంలో ప్రపంచంలోకి కరోనా ప్రవేశించిందో కానీ కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  ప్రతి ఒక్కరికీ మరణ భయం పట్టుకుంది. పుట్టిన బిడ్డ మొదలు చనిపోయే వృద్దుడి వరకు ఎవ్వరినీ వదలడం లేదు.  ఈ కరోనాకి రాజూ పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ భయపెడుతుంది. ఒకదశంలో ఈ కరోనా భారిన పడిన వారు ముందుగానే ఆత్మహత్య చేసుకుంటున్నారంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవొచ్చ.   తాజాగా బెంగళూరులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని ఐదో అంతస్తు నుంచి దూకి  ఓ కరోనా పేషెంట్ (50) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  నగరంలోని విక్టోరియా ఆసుపత్రిలో  ఈ ఘటన జరిగింది.

 

ఆసుసత్రిలోని ట్రామా వార్డు నుంచి మృతుడు దూకాడని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. తొలి అంతస్తు రూఫ్ టాప్ పై మృతదేహం లభ్యమైందని చెప్పారు. మృతుడు తీవ్రమైన శ్వాసకోస సమస్యలతో శుక్రవారం నాడు ఆసుపత్రిలో ఆయన చేరారని తెలిపారు. కిడ్నీ సంబంధిత ఇబ్బందులు కూడా ఆయనకు ఉన్నాయని... పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటవ్ నిర్ధారణ అయిందని చెప్పారు. 

 

అప్పటి నుంచి అతను చాలా మానసికాందోళనకు గురి అయ్యారని.. డాక్టర్లు, ఇతర పేషెంట్లు సైతం అతనికి మనోధైర్యం చెప్పారని.. కానీ అతను మరణించడానికే సిద్దమైన ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.  కాగా, కర్ణాటకలో ఇప్పటి వరకు 500కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 19 మంది మృతి చెందారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: