కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు ప్రతి రోజు ఎక్కువగా చేయ వలసి పరిస్థితి నెలకొంది. దేశం లో కరోనా పాజిటివ్ కేసులు నానాటికి ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ కేసులను పరీక్షించడానికి ఎన్నో నిర్ధారణ పరీక్షలు చేయవలసిన పరిస్థితి నెలకొంది. కానీ చైనా నుండి వస్తున్నా చైనా ర్యాఫిడ్ టెస్టింగ్ కిట్స్ పనితనం మీద రాజస్థాన్ ప్రభుత్వం అభ్యన్తరం వ్యక్తం చేసింది. ఎందుకంటె రాజస్థాన్ లో రక్త నమూనాలను పరీక్షిస్తుండగా అందులో చైనా కి చెందిన ర్యాఫిడ్ టెస్ట్ కిట్స్ పనితనం దాదాపుగా 94 % వరకు తప్పుడు ఫలితాన్ని ఇస్తున్నాయని కేంద్రప్రభుత్వం కి తెలియజేసింది.

IHG

 

 

రాజస్థాన్ కి తోడు పలు రాష్ట్రాలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశాయి.దీనితో కేంద్ర ఆరోగ్య సంస్థ ఈ కిట్లను రెండు రోజుల వరకు వాడొద్దని తెలియజేసింది. అటు తరువాత పరీక్షల అనంతరం చైనా కిట్స్ పై ఐసిఎమ్మార్ సంచలన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే చైనా రాపిడ్ కిట్లు సరైన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో వాటిని వాడొద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించింది. చైనా నుండి వచ్చిన ఏ టెస్టింగ్ కిట్స్ ను వాడొద్దని ఇసిఎంఆర్ తెలియ జేసింది. దేశంలో ఇప్పటి వరకు 27892 కేసులు నమోదు అయ్యాయి. కాగా 872  మరణాలు సంభవించాయి.మహా రాష్ట్ర ,గుజరాత్ ,ఢిల్లీ మరియు తమిళ్ నాడు లో ఎక్కువగా కేసులు నమోదు అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: