తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి రోజు రోజుకీ విజృంభిస్తూనే ఉంది.  ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా ఈ మాయదారి మహమ్మారి తన ప్రతాపాన్ని మాత్రం చూపించుకుంటూనే ఉంది.  ఏపిలో ఇప్పటికే వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి.. 31 మంది మరణించారు.  కర్నూల్, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ఎక్కువాగ ఈ కరోనా వైరస్ ప్రభావం చూపిస్తుంది. ఇక మొన్నటి వరకు శ్రీకాకుళం, విజయనగరం సురక్షితంగా ఉన్నాయనుకుంటే ఇప్పుడు శ్రీకాకుళంలో కూడా కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి.

 

కరోనా వైజాగ్ లో కూడా తన ప్రతాపాన్ని చూపిస్తుంది. విశాఖలో ఇప్పటివరకు 22 పాజిటివ్ కేసులు ఉన్నాయని... ఈ రోజు కొత్తగా మరో పాజిటివ్ కేసు కసింకోటలో నమోదైందని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.  దీంతో కలిపితే మొత్తం 23 అవుతాయన్నారు. 11265 పీపీఈ కిట్లు విశాఖకు వచ్చాయన్నారు. మరో 8 వేల కిట్లు రాబోతున్నాయని మంత్రి అవంతి పేర్కొన్నారు. కంటైన్మెంట్‌ జోన్లలో ఎలాంటి సడలింపు లేదని, గ్రీన్‌ జోన్‌లో ఉన్నవారికి కాస్త సడలింపు ఉందని మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు.  

 

ఇతర ప్రదేశాల నంచి  వచ్చిన వారిలో ప్రస్తుతం క్వారైంటైన్‌లో 1566 మంది ఉన్నారని... 365 మందిని డిశ్చార్జ్ చేశామన్నారు.  జీవీఎంసీ పరిధిలో 70 రైతుబజార్లు ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 22 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు.  రంజాన్ మాసం కనుక ముస్లిం సోదరులను ఇంటి వద్ద ఉండే ప్రార్థనలు చేసుకోవాలని సూచించనట్లు తెలిపారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: