ఏపిలో పరిస్థితులపై సీఎం జగన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా తమకు ఎక్కడ వస్తుందో అని ప్రతి ఒక్కరికీ భయం ఉండటం సహమే.. అయితే ఎవరికైనా కరోనా వస్తే వారికి అంటరాని వారిగా చూడొద్దని..  నాతో సహా కరోనా ఎవరికైనా రావొచ్చు అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో  కరోనా టెస్టుల సామర్థ్యం పెంచామని, 9 వీఆర్‌డీఎల్‌, 44 ట్రూనాట్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు.  రాష్ట్రంలో ఇప్పటి వరకు 74,551 టెస్టులు నిర్వహించామని, ఏపీలో సగటున 1396 కరోనా పరీక్షలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ప్రజలు వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకోవాలి.

 

ప్రతి ఆస్పత్రిలో ఎన్‌ 95 మాస్కులు ఉన్నాయి. మందులను కూడా డోర్‌డెలివరీ చేసే పరిస్థితి తెచ్చాం. రాష్ట్రంలో గ్రామ వాలంటీర్లు, ఆశావర్కర్లతో మంచి వ్యవస్థ ఉంది. ఇప్పటికే మూడు సార్లు రాష్ట్రం మొత్తం సర్వే చేశాం.  ఏపీలో 5 కోవిడ్‌ క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులను ఏర్పాటు చేశాం.  దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీ మాత్రమే. రాష్ట్రంలో 80శాతానికి పైగా గ్రీన్‌ జోన్‌లో ఉంది. కరోనా ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నవారికి వస్తుందని అంటున్నారు.

 

అయితే చనిపోయిన వారు కూడా వయసు వచ్చినవారు.. బీపీ, షుగర్, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారే.. కరోనా వల్ల ప్రమాదాలు జరగకముందే మనం జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని పూర్తిగా కట్టడి చేయొచ్చని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.   కరోనాపై అనవసర భయాలకు ప్రజలు దూరంగా ఉండాలి.  ఇది రంజాన్ మాసం ముస్లిం సోదరులు ఇంటి పట్టున ఉండి ప్రార్థనలు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: